News

విశాఖలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్


రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ నేడు విశాఖకు వచ్చారు. భారత నావికా దళంలోని తూర్పు కమాండ్ ను పరిశీలించే నిమిత్తం ఆయన కొద్దిసేపటి క్రితం విశాఖ చేరుకున్నారు. రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మనోహర్ పారికర్ ఇప్పటికే త్రివిద దళాల్లోని పలు ప్రధాన విభాగాలను పరిశీలించారు. జమ్మూ కాశ్మీర్ లోనూ ఆయన పర్యటించారు.